నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు Quotes
నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు
by
శారద శ్రీనివాసన్4 ratings, 3.75 average rating, 0 reviews
నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు Quotes
Showing 1-4 of 4
“సృష్టిలోని పిపీలికం మొదలు బ్రహ్మాండం దాకా శ్రోత కనులముందుకు తేగలిగిన శక్తి రేడియో నాటకానికుంది. కేవలం ఒక శబ్ద సూచనతో మీ కల్పనాశక్తిని ఉజ్జీవింప చేసి, మీ కళ్ళముందు బొమ్మకట్టిస్తుంది. మిగతా ఏ ప్రక్రియా కలిగించలేని ఒక అద్భుతమైన అనుభూతి కలుగజేస్తుంది.”
― నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు
― నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు
“ఆర్టిస్టు నిరంతరాన్వేషిగా వుండాలి. దృష్టి ఎప్పుడూ జనం మాట్లాడుకునే మాటల మీద వుండాలి. నలుగురు కలిసినప్పుడు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు, వాళ్ళ గొంతు పిచ్ ఎంతలో ఉంది. అదే ఇద్దరే అయితే ఎలా ఉంది, చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటోంది [...] ఒక ఆర్టిస్టు మంచి ఆర్టిస్టుగా ఎదగాలంటే నిరంతరం జీవితాన్ని చదువుతూనే ఉండాలి.”
― నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు
― నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు
“ఇంగ్లీషు భాషను ఎలా పలకాలో ఏం తప్పులు పలుకుతున్నామో - చెప్పేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ వుంది. అదే మన మాతృభాష తెలుగు మాట్లాడినా చెల్లిపోతుంది.”
― నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు
― నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు
“జబ్బులు మంచి వాళ్ళనీ, చెడ్డ వాళ్ళనీ, చిన్ననీ, పెద్దనీ భేధభావం చూపవుగా. వాటికి ఎవరి మీద ఇష్టం కలిగితే వాళ్ళని పట్టేసుకుంటాయి.”
― నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు
― నా రేడియో అనుభవాలూ జ్ఞాపకాలు
