Telugu Readers discussion

అమృతం కురిసిన రాత్రి (Amrutham Kurisina Raatri)
34 views
Discussions on books > అమృతం కురిసిన రాత్రి

Comments Showing 1-11 of 11 (11 new)    post a comment »
dateUp arrow    newest »

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Lets post and discuss అమృతం కురిసిన రాత్రి kavitalu.


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
1. నా కవిత్వం
2. దృశ్య భావాలు
3. ప్రాతఃకాలం
4. సంధ్య
5. ఈ రాత్రి
6. పాడువోయిన ఊరు
7. ప్రవాస లేఖ
8. మేగ్నా కార్టా
9. ఖాళీ చేసిన
10. వేసవి
11. శిక్షాపత్రం
12. ముసలివాడు
13. సైనికుడి ఉత్తరం
14. టులాన్
15. గుండెకింద నవ్వు
16. ఈ రాత్రి
17. వాన కురిసిన రాత్రి
18. పిలుపు
19. భూలోకం
20. యుగళగీతిక
21. ఆ రోజులు
22. కవి వాక్కు
23. ప్రకటన
24. ఆర్తగీతం
25. కాయ్ రాజా కాయ్
26. గొంగళి పురుగులు
27. అద్వితీయం
28. నీవు
29. ఒక శ్రుతి
30. తపాలా బంట్రోతు
31. కఠినోపనిషత్
32. రాజమండ్రి పాటలు
33. రాత్రివేళ
34. వసుదైక గీతం
35. స్వేచ్ఛా విహారం
36. దీపం
37. ప్లస్ యింటూ మైనస్
38. మైనస్ యింటూ ప్లస్
39. న్యూ సిలబస్
40. అమృతం కురిసిన రాత్రి
41. లయగీతం
42. ఒక్కసారి
43. విరహోత్కంఠిత
44. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు?
45. ప్రార్ధన
46. యుద్ధంలో రేవు పట్టణం
47. నీడలు
48. చావులేని పాట
49. కొనకళ్ళకు అక్షరాంజలి
50. పోయిన వజ్రం
51. నెహ్రూ
52. వానలో నీతో
53. ప్రవహ్లిక
54. అదృష్టాధ్వగమనం
55. నవత - కవిత
56. సి.ఐ.డి. రిపోర్టు
57. నేనుకాని నేను
58. నిన్న రాత్రి
59. కిటికీ
60. నువ్వులేవు నీ పాట ఉంది.
61. అభినవ ఋగ్వేదం


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల దగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
-----------------------------


rn_హరీశ్  | 40 comments "నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు"

ee okka pankthi lone munupati thaaram jeevana aunnathyam podigaadu Tilak....

evaro peddaayana cheppaga vinnanu,
mana samvastharam lo okaanoka maasam lo punnami naadu orandari illalo aadaapillalu pattu battalu katti, nagalatho kalakala laadutho... thotallo cheri vennalalo Raatri rendu moodu jhaamulu gadichedaaka aadukunevaaranta....

idi vinnapudu kaani theleeledu aa maatallo andam....

..dhanyosmi.


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
@Lakshmi : మాస్టారు మీ , అద్భుతమైన తెలుగు ఇంగ్లీష్ లెటర్స్ లో చదవాలంటే కష్టం గా ఉంది :)

అందమైన ఆడపిల్లలు అన్న లైన్ మాత్రమే వ్రాసి ఉంటే మాములుగానే ఉండేది , దయపారావతాలు తర్వాత విజయ ఐరావతాలు అన్నాడు చూడు ! అక్కడ పడిపోయా !


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
ఈ రాత్రి

ఈ రాత్రి
బరువుగా బరువుగా
బ్రతుకు కీళ్ళ సందులలోన
చీకటి కరేల్మని కదిలింది

ఈ రాత్రి
నిలువునా నిలువునా
పరచుకుని అవనిగుండె నెరదలలోని
వింత బాధల విప్పి చూపింది

ఈ రాత్రి
మూగతో సైగతో
మేలుకొన్న నిరాశతో మాటలాడాను


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
వాన కురిసిన రాత్రి

చినుకు చినుకుగ వాన కురిసినటు
నిశికి
సన్న చీకటి దోమ తెర కట్టినటు

చలి చలిగ గాలి
చెట్ల ఆకులదూరి కప్ప బెకబెకల తేలి
చూరులో నిదుర తూలి
గుండె కొసలకు మెల్లగా జారినటు
కప్పుకొని దళసరి దుప్పటిలో
వెచ్చవెచ్చని మనసులో పొరలివచ్చు
నిదురలో చినుకు రాలినటు
కలలు జారు సవ్వడి
ఆ రోజు సాయంత్ర మమ్మిన మల్లెపూలు
ఆమె సిగదాల్చి నవ్వినటు
నా యొడలు తగిలినటు
కాలమే కరిగినటు
ఆకసము వణికినటు
ఏదో అనిపించి సగము తెరచిన కనుల
కెదురుగా
గదిలోన దీపశిఖ కదలునీడల నడుమ
మదిలోన తొలి కోర్కె మసక నిద్దుర నడుమ
చినుకు చినుకుగ వాన కురిసినటు

నిశి

సన్న చీకటి దోమ తెర కట్టినటు
గదిలోన దీపశిఖ కదలు నీడల నడుమ
ఎర్రనై ఏకాంత సరస్సున విరిసిన
ఎర్రకలువ యటు
తీరని కోరికటు
తెరచిన విరహిణి నయనమటు
కదలు నీడల మధ్య గదిలోన దీపశిఖ
కదలు కలల బంగరు వలల
రంగురంగుల బొరుసు లాడించు చేప
చేపలకు తగిలి మెరిసిన నీరు
నీరువిడిచి చినుకు చినుకుగ వాన కురిసినటు
నిద్రవిడి చినుకు చినుకుగ వాన కురిసినటు
నిద్రవిడి మినుకు మినుకుగ స్పృహ మెరిసినటు


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
పిలుపు

ధాత్రీ జనని గుండె మీది
యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు
మీ రెవరైనా చూశారా
కన్నీరైనా విడిచారా
కోటి కోటి సైనికుల ఊడిపడిన
కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను
మీ రెపుడైనా చూశారా
కన్నీరైనా విడిచారా
దరిద్రుని నోరులేని కడుపు
తెరుచుకొన్న నాలుక బూడిదలో వ్రాసుకున్న మాటలు
మీరెపుడైనా చూశారా
కన్నీరైనా విడిచారా
కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే
మొండిచేతుల మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం
మీరెవరైనా చూశారా
కన్నీరైనా విడిచారా
ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి పోకపోతే
అణచుకొన్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందే
మీరిపుడైనా మేల్కొంటారా
చీకటి తెరలను చీలుస్తారా
ప్రభాత విపంచిక పలికిస్తారా?


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
మీరెవరైనా చూశారా,కన్నీరైనా విడిచారా ?
మీరిపుడైనా మేల్కొంటారా,చీకటి తెరలను చీలుస్తారా,ప్రభాత విపంచిక పలికిస్తారా? 👌👌👌


message 10: by ♛ ѶaɱՏ¡ (last edited Feb 10, 2019 05:12AM) (new) - rated it 5 stars

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
21.ఆ రోజులు

ఆ రోజుల్ని తలుచుకున్నప్పుడల్లా
ఆనందంలాంటి విచారం కలుగుతుంది
నేటి హేమంత శిధిల పత్రాలమధ్య నిలచి
నాటి వాసంత సమీర ప్రసారాల తలచి
ఇంతేగదా జీవితం అన్న చింత
ఇంతలోనే ముగిసిందన్న వంత
చెమ్మగిలే నా కళ్ళని ఎవరైనా చూస్తారేమో అని
చెదిరిన మనస్సుతో యిటు తిప్పుకుంటాను

పచ్చని పచ్చికల మధ్య
విచ్చిన తోటల మధ్య
వెచ్చని స్వప్నాల మధ్య
మచ్చికపడని పావురాల మధ్య
పరువానికి వచ్చిన ఆడపిల్లల మధ్య
పరుగెత్తే నిర్ఝరుల మధ్య
తెరలెత్తే మునిమాపుల మధ్య
ఇప్పటికీ చూడగలవు నా తొలి యౌవనపు గుర్తులు
ఇప్పటిక వినిపిస్తవి నాటి స్వప్న వంశీరవమ్ములు

కాలవ గట్టునున్న ఈ కడిమిచెట్టుకు తెలుసు
మనం చెప్పుకున్న రహస్యాలు
ఊరి చివరినున్న మామిడి తోపుకు తెలుసు
మనం కలలుగన్న ఆదర్శాలు
ఇంటి వెనుకనున్న ఎర్రగన్నేరుకు తెలుసు

చిక్కబడుతూన్న సంజె చీకట్ల చాలులో
కలసిన పెదవుల నిశ్వాసాలు
అందాన్ని చూసినప్పుడల్లా స్పందించిపోయాం
బాధను కని కరుణతో కన్నీరు విడిచాం
శత్రువెదురైతే కండలపైకి చొక్కా చేతులు మడిచాం
పారిజాతపు పువ్వుల్లాంటి నవ్వుల్ని విరజిమ్ముకుంటూ
ప్రతి వీధినీ ప్రతి యింటినీ ప్రతి గుండెనీ శోభింపచేశాం
అమాయకమైన కళ్ళతో బాధ్యతలు లేని బలంతో
స్వచ్ఛమైన స్వేచ్ఛతో ఉషఃకాంతివంటి ఊహతో
భవిష్య దభిముఖంగా సుఖంగా సాగిపోయాం

ఎన్ని రకాల రంగు రంగుల పువ్వుల మాలలు
కిటికీలకు మెరిసే గాజుగొట్టాల జాలరులు
నేలమీద మొఖముల్ తివాసీలు అత్తరు గుబాళింపులు
జవరాళ్ళ జవ్వాడే నడుములపై ఊగే వాల్జడలు
బాధ్యతలేని అధరాల చిటిలే నవ్వుల వైడూర్యాలు
ప్రతీ ఒక్క నిముషం ఒక్కొక్క ఒమార్ ఖయ్యాం
రుబాయత్ పద్యాలవంటి రోజులవి ఏవి ప్రియతమ్
చప్పుడు కాకుండా ఎవరు హరించారు మన పెన్నిధిని

నీతులు నియమాలు తాపత్రయాల కత్తుల బోనులో
నిలిచి నిలిచి తిరిగే ఎలుగుబంటివంటి మనం
డేగలాంటి ఆ చూపుని ఆ వుసురుని ఆ ఎత్తుని
మబ్బులాంటి ఆ పొగరుని మైకాన్ని స్వర్గ సామీప్యాన్ని
తిరిగి పొందలేమన్న సంగతి నాకు తెలుసు

కాని
నేటి హేమంత శైత్యానికి గడ్డకట్టుకున్న నా వెనుక
నాటి వాసంత విహారాల జాడలున్నవన్న తృప్తి
మాత్రం మిగిలి
ఒక్క జీవకణమైనా రగిలి
శాంతిని పొందుతుంది నా మనస్సు
నా భావి తరానికి పిలుస్తుంది
పవిత్రమైన వీని ఆశీస్సు

* * *


message 11: by rn_హరీశ్ (last edited Feb 11, 2019 04:49AM) (new) - rated it 5 stars

rn_హరీశ్  | 40 comments 55. నవత-కవిత

మిత్రమా ..
కవిత ఉన్నపుడే నవతా రాణిస్తుంది
అసలు కవితలోని నవతా కూడా ఉంది
కానీ, మోడరన్ గా ఉందామనీ, ఎదో అందామనీ
తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని
అర్థంలేని ఇమేజరీతో కలగాపులగపు వర్ణనలతో
డిల్లాన్ థామస్ కు చేతకాని అనుకరణలతో
ఒక దేశం నిర్దేశం లేని వాక్యాల వికారం తో
ఎందుకు బాధిస్తావు నన్ను, బాధపడతావు నువ్వు

"..............................................................................
...............................................................................
...............................................................................
..............................................................................."
ఇలా రాయడం కొత్తగా, గమ్మత్తుగా ఉంటుంది కానీ, ఇది నాన్సెన్స్
ఇది పసితనం ప్లస్ వెర్రితనం ఇంటూ డికడెన్స్

కవిత్వం లో అబ్స్క్యూరిటీ కొన్ని సందర్భాలలో ఉండవచ్చును
......................................................................................................
అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి, నిన్ను పలకరించాలి
.......................................................................................................
ప్రతి మాటకీ ..............................., ...................................
ప్రతి చిత్రణకీ .............................., ..................................
.................................................................................. అని దబాయించకు
అలిగి నన్ను శపించకు, అన్నా, నీ మీద నాకు కోపంలేదు.
.
.
.
.
కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు
.
.
.
.





-దేవరకొండ బాల గంగాధర తిలక్


శ్రీశ్రీ ఒక పురాణం లాగా సంకేత సహితం గా 'నవకవనానికి' ఎం కావాలో చెబితే, తిలక్ ఒక కావ్యం లాగా మెత్తని పూలతో, చల్లని చురకలతో, నింపాది గా, సోదాహరణం గా, మన పక్కన కూర్చుని గడ్డం పట్టుకుని బుజ్జగిస్తూ నే మెల్లగా చెవులు మెలేసి మరీ చెప్పినట్టే ఉంటుందీ కవిత. విశ్వనాధ గారన్నట్టు 'యత్ కించిత్ కవుల'మనుకునే వారంతా ఈ కవి'తల'లో తమని తాము వడగట్టుకుంటే అప్పుడప్పుడూ కొన్ని పత్రికల్లో (డో)కుకవితలు చదివి మెదడు పాడు చేసుకోకుండా రసజ్ఞులైన వారిని, 'అఖండ' తెనుగు పాఠక జనాలని ఉద్దరించకపోయినా కనీసం కాపాడిన వాళ్లవుతారు.

...ధన్యోస్మి.


back to top