నేను నడిచింది, కన్నీటి లోయలలో జైత్రయాత్ర ౼ ఆ యాత్రలో నా వెంట ప్రభువు ఉన్నాడు ౼ నేను ప్రభువుతో కలిసి నడిచినప్పుడు ఏర్పడిన "సవ్వడి" ఈ పాటలు. ఇవి నా గేయాలు కావు, నా హృదయంలోని గాయాలు ౼ ఆ గాయాలు నేర్పిన పాఠాలు! నా గాయాలను యేసు తన చల్లని స్పర్శ చేత మాన్పినప్పుడు నాలో ఉబికిన ఆనంద భాష్పాలు ఈ పాటలు.