గొప్ప క్రియేటివ్ రచయితలుంటారు. కాని క్రియేటివిటీ, దార్శనికత ఒకరిలోనే వుండటం ప్రపంచంలోనే చాలా అరుదు. అలాంటివారిలో జీన్‌పాల్ సాత్రే ఒకరు. అలాంటి కోవకు చెందినవారే వడ్డెర చండీదాస్. అయితే సాత్రే చుట్టూ ఐరోపా దేశాల విభిన్న దర్శన దృక్పథాలు సమృద్ధిగా వున్నారు. కాని కొన్ని శతాబ్దాల తరువాత ఈ ఉపఖండంలోనే ఒక కొత్త దర్శన శాస్త్రాన్నిరచించి ప్రతిపాదించిన ఘనుడు ఈ తెలుగువాడు.
1984 - 2005 వరకు తన సన్నిహితుడుకు రాసిన ఉత్తరాల సందేశం ఈ పుస్తకం.. సాధారణంగా ఉత్తరాలు అన్ని కేవలం మన బాధను వ్యక్తపరచడానికో లేక అవసరాన్ని గుర్తుచేయడానికో ఉంటాయి కేవలం కొన్ని మాత్రమే అభిప్రాయాలను,ఇష్టాలను,అలోచన దృక్పధాన్ని తెలియచేసేలా ఉపయోగపడతాయి..