నవ్య వార పత్రికలో ప్రచురించబడిన కథలకు పుస్తకరూపం ఈ ప్రచురణ. నవ్య తెలుగు వార పత్రికలో మొదటి పేజీలో కథలన్నిటినీ కూర్చి పుస్తకంగా విడుదల చేసారు. మొత్తం కథలు వంద. వేరు వేరు అంశాలతో అల్లిన కథలు నిజంగా రచయిత యొక్క ప్రతిభను తెలియచేస్తాయి. నాకు తోచిన సలహా ఎంటంటే ఈ కథలో కొన్నిటిని పాఠ్యాన్శాంగా ఉంచితే బహుశా ఉచితంగా ఉంటుంది. ఎందుకంటే కథలన్నీ గూడా విలువలను తెలియచెప్పేవిగా వున్నాయి, పైగా కతలన్నీ ఒక్క పేజీనిమించవు. చదవటానికి కూడా బహుశా ఎవరికీ అభ్యంతరం వుండకపోవచ్చు.