Telugu Readers discussion

31 december 199,999
This topic is about 31 december 199,999
16 views
Group reads- Current Year > BOTM May 2020- 31 december 199,999

Comments Showing 1-8 of 8 (8 new)    post a comment »
dateDown arrow    newest »

Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
HI friends,

As discussed, the BOTM for May,2020 is

31 december 199,999 by N.R. Nandi

Pls use this thread for discussion/ reviews/ progress updates etc.


Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
hi all, I finished reading this book. I got so involved in the book I finished it in a single sitting. took nearly 3 hours to finish it.

don't want to share before everyone finishes reading. it may spoil it for u.

can't wait to share my views with u all. hope everyone will complete the reading and join discussion.


rn_lakshminarasayya | 39 comments hi all,
completed this book few days ago. awaiting others' sharing their reading experience of this book.


Priya (priyachennareddy) | 298 comments Mod
Lockdown lo print books order chesukolenu.

Harish/Lakshminarasayya - Ebook link unte share cheyyagalara?


Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
Priya wrote: "Lockdown lo print books order chesukolenu.

Harish/Lakshminarasayya - Ebook link unte share cheyyagalara?"


Priya telegram lo mana group channel undi. andulo already uploaded.
@telugureaders


Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
My review for the book:

https://www.goodreads.com/review/show...

I enjoyed the book throughout. One of those books which i finished in a single sitting. very gripping. some times overboard but still a great read.


rn_lakshminarasayya | 39 comments ఒక పుస్తకానికి పాఠ్య స్పందన తెలుపుతూ ' మనది త్రిమితీయ (3 dimensional) జగతి. ' అని మొదలుపెట్టాను. 4వ మితి (4th dimension) కాలమో, లేదా గురుత్వాకర్షణ శక్తో నేటికీ ఇధమిద్ధంగా స్పష్టత లేదు.

శ్రీశ్రీ గారి కథలు, కథానికలు అనే పుస్తకంలో ' లెనిన్ ' హఠాన్మరణంతో సంభవించే పరిణామాలను స్వప్నరీతి లో వివరించే విన్యాసం చాలా గొప్పగా ఉంటుంది. ఫిక్షన్ లాగా మొదలయ్యి, సైంటిఫిక్ ఫిక్షన్ స్థాయి దాటి, ఫాంటసీ ని స్పృశించి, వ్యంగ్యంతో ముగుస్తుంది. ఇందులో గల్పిక లాగా ఊహా ధోరణి లో ఆద్యంతం ఉత్సు కతతో సాగే వైనం చక్కగా ఆకట్టుకుంటుంది. ఆంగ్లంలో సైంటిఫిక్ ఫిక్షన్ కోకొల్లలుగా ఉన్నా కూడా, బొత్తిగా పరిశీలన లేకుండా అటువంటి ప్రక్రియలో రచనా ప్రయత్నాలు కొంచెం అరుదనే చెప్పాలి. ఎందుకంటే మానవుడి పరిధి దాటి ఉండే 4వ మితి (4th dimension), కాంతి వేగం లో ప్రయాణం, పరకాయ ప్రవేశం, గ్రహాంతర వాసుల ఉనికి, చావుని జయించడం, ashtral projection లాంటి అంశాల మీద ఏదైనా రచన వచ్చిన,అప్పటికి సరికొత్తగా ప్రతిపాదించబడిన సిద్ధాంతాల ఆధారంగానే వచ్చేవి. అదికూడా ఎంచుకున్న సిద్ధాంతాన్ని విడిచి సాము చేయకుండా, ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా వాడుకుని అందులోని పరిమితిని కూడా జాగ్రత్తగా కథా వస్తువులో వాడుకుంటూ చేసేవారు.

పరిణామ భౌతిక (Quantum Physics) శాస్త్రం ద్వారా ఇప్పుడిప్పుడే కాలం తాలూకా రహస్యాలని మెరుగైన మరింత నిర్దిష్టమైన పద్ధతుల్లో పరిశోధించి తెలుసుకోవడం మొదలైంది.

వృత్తిరీత్యా నేను నానో చిప్ లు డిజైన్ చేసే ఉద్యోగంలో ఉన్నాను. నేను ప్రస్తుతం పని చేసే చిప్ వివిధ ఎలెట్రానిక్ పరికరాల్లో ఉంచి తయారు చేయడానికి కనీసం 1-2 సంవత్సరాలు, ఆ పరికరాలు అనేకానేక పరీక్షలకు నిలిచి, భారీ ఉత్పత్తి(mass production) ద్వారా వాణిజ్యంలో రావడానికి ఇంకో సంవత్సరం పడుతూ ఉంటాయి. అంటే 2-3 ఏళ్ల తర్వాత విపణిలో ఉండబోయే పోటీకి తట్టుకునే విధంగా చిప్ లక్షణాలు(specifications) ఉండేలా చూసుకుని మొదలు పెడతాం ఒక్కో ప్రాజెక్ట్. ఎలక్టరానిక్ పరికరాల పరిణామం, సామర్ధ్యం కూడా ప్రస్తుతం ఒక నెమ్మదైన గమనంలో ఉన్నాయి. అంటే, కొత్త విప్లవాత్మకమైన ఆవిష్కరణలు లేకుండా, ఇప్పుడున్న విజ్ఞానం ఇంతవరకూ పెరిగిన వేగంతో ఇప్పటినుండి పెరగడం సాధ్యం కాదు.

ఇవి కాక, కృత్రిమ మేధ (artificial intelligence) లాంటి అధునాతన సాంకేతికతల గురించి కూడా వృత్తిలో భాగంగా అపుడపుడూ చదువుతూ ఉంటాము. నా ఈ నేపథ్యం కారణమో ఏమో, నాకు ఈ నవలలో చెప్పబడిన పలు సాంకేతిక అంశాలు అస్సలు కొరుకుడు పడలేదు. అసలు కథ తాలూకా ప్లాట్ పాయింట్లో చాలా పెద్ద లోపమున్నట్లు తోచింది. నవలలో చెప్పిన తరంలో, జ్ఞానంగాడు అను పాత్ర ' తాతయ్య ' పాత్రల మధ్య సంభాషణలలో రెండు విషయాలు జరుగుతాయి:
1. తాతయ్య గతంలో ఉన్న తన భార్య ' సుజాత ' గారితో మాట్లాడే సన్నివేశం.
2. తాతయ్యని ముందున్న ' గది ' మాయం అవ్వడంతో, ఇంకో గదికి తీసుకెళ్ళే ప్పుడు ' మేము కాలానికి బద్దులం కాము తాతయ్య, నీకు ఈ గది త్రీమితీయ కొలతల్లో ఒకటి లాగే కనపడుతుంది. కానీ నాకు నాలుగో మితి అయిన కాలంతో కలిపి, వివిధ కాలాల్లో ఈ గది ఎనిమిది గా కనపడుతుంది ' అని స్పష్టం గా చెప్తాడు మన జ్ఞానంగాడు.

కాలంలో ముందుకి వెనక్కు ప్రయానించగలం అని జ్ఞనంగాడు చెప్పినా, జరిగిన హత్యని సులువుగా కాలంలో వెనక్కు వెళ్లి ఆపుచేయగలిగి కూడా అసలా కోణంలో ఒక్కరూ ప్రయత్నం కాదు కదా ఆలోచన కూడ చేయకపోవడం వింతగా అనిపించింది. మెలకువగా ఉన్న వ్యక్తి ఆలోచనల నుండి, అతడు కావాలనుకున్న వస్తువుని తయారు చేయగలిగే సాంకేతికత ఉండి కూడా, కేవలం నిద్రపోతున్న వ్యక్తి తాలూకా ఆలోచనలు మేల్కొని ఉన్న మిగతా వాళ్ళని ఇష్టానుసారం అదుపు చేస్తున్నా ఏమీ చేయలేక పోవడం చొద్యమే.
ఈ నవలలో చెప్పబడిన చాలా సాంకేతికతల ఇందులోనే చెప్పబడిన ఇంకొన్ని అంశాలకు విరుద్ధంగా ఉన్నాయి.1980లలో ప్రపంచం మానవుని మేధస్సుకు ఏదైనా సాధ్యమే అనుకునేంతగ ఆశాదృక్పద్ధం తో ఉన్న మాట ముమ్మాటికీ నిజమే. కానీ, అసాధ్యం అనేది లేనంతగా విజ్ఞానం పెరిగిపోవడానికి చాలా పరిధులు ఉన్నాయి. ఆంగ్ల సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో కాలం గురించి,కాతివేగం గురించి, ఉన్న సిద్ధాంతాలను(కేవలం సిద్ధాంతాలను మాత్రమే సుమా) విచ్చలవిడిగా వాడుకుని, కథలో జొప్పించేసి రాయడం జరిగింది. చాలా చోట్ల చదివింది మింగుడు పడ్డానికి తర్కం అడ్డొస్తుంది. ఈ నవలలో చెప్పినంతగా సాంకేతికతను అలవరచు కున్న మానవజాతి మరి కచ్చితంగా చావుని జయించే ఉండాలి. కానీ కథలో చనిపోయిన వాడిని బ్రతికించడానికి చాలా చాలా కష్టపడతారు. కాంతివేగం కన్నా మనోభావాలను ప్రసరింపగలగడం అనే ప్రక్రియను స్పష్టంగా, నిర్దిష్టంగా వివరించనేలేదు. ఆంగ్లంలో, మానవుడి పరిధి దాటి ఉండే 4వ మితి (4th dimension), కాంతి వేగం లో ప్రయాణం, పరకాయ ప్రవేశం, గ్రహాంతర వాసుల ఉనికి, చావుని జయించడం లాంటి అంశాల మీద ఏదైనా రచన వచ్చిన,అప్పటికి సరికొత్తగా ప్రతిపాదించబడిన సిద్ధాంతాల ఆధారంగానే వచ్చేవి. అదికూడా ఎంచుకున్న ఏదో ఒక్క సిద్ధాంతాన్ని విడిచి సాము చేయకుండా, ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా వాడుకుని అందులోని పరిమితిని కూడా జాగ్రత్తగా కథా వస్తువులో వాడుకుంటూ చేసేవారు.

N.R. నంది లాంటి మునుపటి తరం రచయిత గారిని విమర్శించడం నాకు లక్ష్యం కాదు, అలా చేస్తే నాకు ఒరిగేది కూడా ఏమీలేదు. ఈ నవలని ఒక ప్రయత్నం గా మాత్రమే చూడగలిగితే మేలు. పైన చెప్పబడిన అధునాతన సాంకేతిక అంశాల మీద ఏ కొంచెం మౌలిక అవగాహన ఉన్నా ఈ నవలలో చెప్పబడిన విధంగా ఉండటం ఎంత కష్టమో తెలుస్తుంది. వాటిలో లాగా, లెజర్ కిరణాలు, ప్లాస్మా లేజర్ కిరణాల వాడకం ఒక్కటి కనుక్కున్నా కూడా ఆధిపత్యపోరు కోసం సాగే యుద్ధంలో కనీసం 70+% మానవాళి తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. 80ల నాటి అత్యంత ఆశావహ దృక్పథంతో, కనీసం 2లక్షల సంవత్సరాల తర్వాత అయిన, సాంకేతికత తోడ్పాటుతో విశ్వశాంతి ఒనగూ రుతుందేమి అనే ఒక ఆలోచనలో, తర్కమనే కోణాన్ని ఏమార్చి చేసిన రచనా ప్రయత్నం. ఇందులో చెప్పబడిన ఆదర్శం మాత్రం సకల మానవాళికి దివిటీ లాంటిది.

నా ఈ స్పందనతో ఎవరినైనా నొప్పించిఉంటే క్షంతవ్యుడిని.

షరా:
ఏకబిగిన రాయడం(టైపు చేయడం) వలన, అచ్చుతప్పులు ఉంటే మన్నించగలరు.


rn_lakshminarasayya | 39 comments ఇక్కడున్న పెద్దలు, పిన్నలు, చదువరులలో ఈ నవల చదివిన వారుకూడా వారి వారి అమూల్యమైన స్పందనలు/సమీక్షలు పంచుకోవాలని కోరుతూ...
-rn


back to top