Telugu Readers discussion

ఖడ్గ సృష్టి [Khadga Srusti]
13 views
Store Room/Group reads > BOTM - August, 2018 - ఖడ్గ సృష్టి

Comments Showing 1-12 of 12 (12 new)    post a comment »
dateDown arrow    newest »

Priya (priyachennareddy) | 298 comments Mod
Discussion thread for August, 2018 group read.

ఖడ్గ సృష్టి Khadga Srusti
ఖడ్గ సృష్టి Khadga Srusti  by Srirangam Srinivasarao

నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్‌

ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ

ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని,

ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని,

నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, కదనరంగంలోని సేనానికి మించిన కసాయిని,

ఎంచేతనంటే, అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతిని, క్షేమాన్ని చట్టాలను, కట్టుదిట్టాలను, వాటిని ధిక్కరించడమే నా పని,

అందరూ నాకెంత దూరమైతే అంత బిర్ర బిగుస్తాను,

అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో!

దేన్నీ లక్ష్యపెట్టను, ఎన్నడూ లక్ష్యపెట్టలేదు. అనుభవాన్ని, ఆచారాన్ని అధిక సంఖ్యాకుల్ని అవమానాలని,

నరకమనేది నన్ను భయపెట్టదు, స్వర్గం నన్నాకర్షించదు,

డియర్‌ కామ్రేడ్‌! విను! నాతో రా మునుముందుకి, ఈ

ప్రోత్సాహం ఎందుకో, ఎక్కడికో నాకూ తెలియదు. అయినా రమ్మనడం మానలేను,

జయాపజయాలతో నిమిత్తం లేదు. ఎడతెగనిది మన యాత్ర.

వాల్ట్‌ వైట్‌మాన్‌ ఆంగ్ల కవితకు శ్రీశ్రీ 'కామ్రేడ్‌' శీర్షికన చేసిన అనువాదమిది. ఇంకా ఇందులో శ్రీశ్రీ రచించిన కవితలు - మరికొన్ని అనువాద కవితలు (120) - వాటికి సంబంధించిన ఫుట్‌ నోట్స్‌ ఉన్నాయి.


message 2: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (last edited Aug 08, 2018 04:30PM) (new) - rated it 3 stars

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
ఇంతకీ శ్రీ శ్రీ గారు ఖడ్గాన్ని ఎందుకు సృష్టించారో ! First page tells all about it .


4 lines i read just now .

సంతాపం కొంతసేపు
సంతోషం కొంతసేపు
సాగించిన సంభాషణలో
సారాంశం మరేముంది ?

- ఖడ్గ సృష్టి


message 3: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new) - rated it 3 stars

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
ఇంకా ఎవరైనా చదివారా? టైం దొరక్క పోతే ఒకే, బుక్ దొరక్క పోతే మాత్రం నాకు చెప్పండి. I can help.


message 4: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (last edited Aug 24, 2018 03:30PM) (new) - rated it 3 stars

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
ఖడ్గ సృష్టి
----------
రెండు రెళ్లు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో
అసతంత్రతని జయించడానికి
అహింసాయుధం ధరించామంటూ
రక్తపాతం లేకుండానే
రాజ్యం సంపాదించామంటూ

అవినీతి భారీ పరిశ్రమలో
అన్యాయాల ధరలు పెంచేసి
సాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని
చక్రవడ్డీ తిప్పే కామందులకు

క్షణ క్షణం మారుతున్న లోకాన్ని
సరిగా అర్థంచేసుకున్న వాళ్ళంతా
పేద ప్రజల పక్షం వహించడమే
పెద్ద అపరాధమై పోయింది.

అహింస ఒక ఆశయమే కాని
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలటే
ఆయుధం అవసరమే మరి.

ఆశయం ఉండడం మంచిదే కాని
అన్ని ఆశయాలూ మంచివి కావు
ఆశయాలు సంఘర్షించే వేళ
ఆయుధం అలీనం కాదు.

అందుకే అంటున్నాను నేను
అందుకో ఆయుధం అని
ఆచరణకి దారితీస్తేనే
ఆవేశం సార్ధకమవుతుంది.

అందుకే సృష్టిస్తున్నాను
అధర్మనిధనంచేసే ఈ ఖడ్గాన్ని
కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది
జనంతో నిర్మిస్తున్న సర్గం ఇది

ఈ కత్తి
బూజు పట్టిన భావాలకి
పునర్జయం ఇవడానికి కాదు
కుళ్ళిపోతున్న సమాజవృక్షాన్ని
సమూలచ్ఛేదం చెయ్యడానికి

దీన్ని
నల్లబజారు గుండెల్లో దించు
దీనితో
కల్లకపటాలను వధించు

ఇది
సమాన ధర్మాన్ని స్థాపింస్తుంది
నవీన మార్గాన్ని చూపిస్తుంది

ఈ కత్తి
ఊహాసమూహాల వ్యూహాలు పన్ని
వీరవిహారం చేస్తూ
రణక్షోణిలో
జనాక్షౌహిణులు కదలడానికి

అందుకే రాస్తున్నా నొకగీతి
చేస్తున్నా నొక గేతి
రావొయి లోనికి
సందేహం దేనికి?

ఇది నిజం
నవధర్మం మానవధర్మం
అణుశక్తి కన్న
మానవశక్తి మిన్న

రావోయి రావోయి లోనికి
సంకోచం దేనికి
నను చూడగా ఇదేవేళ
నా మన: కార్మికశాల

క్రక్కేది భావాగ్ని సెగలు
క్రమ్మేది దావాగ్ని పొగలు

రావోయి రావోయి లోనికి
రాసేది రవ్యుష్ణ గీతి
చేసేది పవ్యుగ్ర హేతి


message 5: by Siva (new) - added it

Siva (samba_siva) | 108 comments ఈ రోజే బుక్ నా చేతికి వచ్చింది. రేపటి నుండి స్టార్ట్ చెయ్యాలి అనుకొంటున్నాను.


Priya (priyachennareddy) | 298 comments Mod
Samba wrote: "ఈ రోజే బుక్ నా చేతికి వచ్చింది. రేపటి నుండి స్టార్ట్ చెయ్యాలి అనుకొంటున్నాను."

Ditto


Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
Finished..


Priya (priyachennareddy) | 298 comments Mod
శరశ్చంద్రిక లో కొన్ని లైన్లు

చంద్రమండలానికి ప్రయాణం
సాధించరాని స్వప్నం కాదు
గాలికన్న బరువైన వస్తువుని
నేలమీద పడకుండా నిలబెట్టలేదా?

శ్రీశ్రీ గారికి Russians కృషి, మేధాశక్తి మీద గట్టి నమ్మకమున్నట్టుంది. చంద్రయానం ఖచ్చితంగా సఫలమౌతుందని ఊహించి రాసారు.


message 9: by ♛ ѶaɱՏ¡ , @విశ్వనరుడునేను (new) - rated it 3 stars

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
@Priya , You might be right . Well connected the dots . Though Khadga Srushti got published in 1966 he might have written these poems much earlier.

Soviet Union's Luna 2 mission around 1959.
The United States' Apollo 11 during 1969.

I feel , these poems collections , there is not much poetic brilliance except few like 'Saratchandrika' . Political preacher for the armed revolution appears to be get better of the poet and poetry suffered.

Of course, he supported Communism and Russia. After 1955, Some so called Andhra patriots called Sri Sri as Russian devotee and a traitor.


Priya (priyachennareddy) | 298 comments Mod
Priya wrote: "శరశ్చంద్రిక లో కొన్ని లైన్లు

చంద్రమండలానికి ప్రయాణం
సాధించరాని స్వప్నం కాదు
గాలికన్న బరువైన వస్తువుని
నేలమీద పడకుండా నిలబెట్టలేదా?

శ్రీశ్రీ గారికి Russians కృషి, మేధాశక్తి మీద గట్టి నమ్మకమున్న..."


This particular poem was published in 1954. At that time Russia was working towards their Lunar mission and USA was frantically doing the same, hoping to beat Russia for the first time in space research.


message 11: by Priya (last edited Aug 30, 2018 11:19PM) (new) - rated it 3 stars

Priya (priyachennareddy) | 298 comments Mod
♛ ѶaɱՏ¡ wrote: "@Priya , You might be right . Well connected the dots . Though Khadga Srushti got published in 1966 he might have written these poems much earlier.

Soviet Union's Luna 2 mission around 1959.
The ..."


Sri Sri was a communist supporter and during his times, Russia was the communist super power. Also, communist leaders in those days (and even now to some extent), believed in Lenin's (which were based on Marx's) communist principles. So, they were indirectly devoted to Russia and its leaders. Atleast, that is what I thought:)


Harish Challapalli (harishchallapalli) | 302 comments Mod
Read elijeelu by gollapudi, there in a few instances he mentions about Sri sri..


back to top