Telugu Readers discussion

24 views
General Discussions > Kathalu | Kavithalu | Hykulu

Comments Showing 1-12 of 12 (12 new)    post a comment »
dateDown arrow    newest »

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
This is a place holder to share your own writings or to share something you read and got impressed.


message 2: by Siva (new)

Siva (samba_siva) | 108 comments HI Vamsi,

just want to know what does hykulu means?


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
Hi Samba,

Telugu Haikus
Haiku is the smallest poem in the entire world of literature.
It has 3 lines with 5-7-5 letters (syllables). Since the 16th
century, Haiku has been in existence in Japan. Machoo O Basho (sp)
was a Japanese poet who popularized these Haikus. According to
cEra'talau, O Basho can be compared with Vemana who popularized
the a'Taveladi. Even though Haiku was born in Japan, it became
very popular in the West, especially among the English poets.
Material - place - time : This is the relationship found in Haiku.
This is a way to write poetry on Nature. One can not use unnecessary
words since the length of the poem is restricted. The seventeen letter
limit is not enough to say what a poet would like to express in the Haiku.
So, the Haiku poet has to work very hard. Along with the poet, the
reader of the Haiku should also work very hard. That means the
Haiku reader should also be equally imaginative as that of the poet to
enjoy the Haiku. This implies that the Haiku reader should also be
a sort of poet.


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
ధ్వని చెదిరిపోతున్నకొద్దీ
పూల సౌరభం ఎగసి వస్తున్నది:
సాయంత్రం గుడిగంట

* * *


కోతకొచ్చిన వరిచేల మధ్య
కప్పల అరుపులను చూస్తూ...
చంద్రుణ్ని వింటూ నేను

* * *


పంజరంలో పక్షికి
అసూయ
సీతాకోకచిలుకను చూసి

* * *


కొంగ ముక్కుతో పొడుస్తూ
ముక్కలు చేస్తున్నది -

చంద్రబింబం


message 5: by Siva (new)

Siva (samba_siva) | 108 comments ♛ ѶaɱՏ¡ wrote: "Hi Samba,

Telugu Haikus
Haiku is the smallest poem in the entire world of literature.
It has 3 lines with 5-7-5 letters (syllables). Since the 16th
century, Haiku has been in existence in Japan. M..."


Thank You Vamsi


message 6: by Ganadeep (new)

Ganadeep  గణదీప్ | 68 comments Can anyone give me a any good website which has the meaining of all the sri sri poems ? Thannks.


♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
@ గణదీప్ , చాలావరకు శ్రీ శ్రీ గారి కవితలు చదివిన వెంటనే అర్ధం అవుతాయి. ఒకసారి Akella Raghavendra , youtube videos చెక్ చేయండి.


message 8: by Ganadeep (new)

Ganadeep  గణదీప్ | 68 comments ♛ ѶaɱՏ¡ wrote: "@ గణదీప్ , చాలావరకు శ్రీ శ్రీ గారి కవితలు చదివిన వెంటనే అర్ధం అవుతాయి. ఒకసారి Akella Raghavendra , youtube videos చెక్ చేయండి."

Sure. Check chestanu :)


message 9: by Sarath (last edited Jan 31, 2019 04:21AM) (new)

Sarath | 14 comments ఈ మధ్య కాలం లో నా దృష్టి కి వచ్చిన ఒక మంచి కధా సంకలనం " ఉత్తమ తెలుగు వాన కథలు "
ఈ కదా సంకలనం లోని అన్ని కధల లోను వర్షం ఉంటుంది. వేరేలా చెప్పాలంటే ఇప్పటి దాకా వచ్చిన తెలుగు కధలలో వర్షం ఉన్నటువంటి కధల లో నుండి కొన్ని మంచి కధలను ఎంపిక చేసి ప్రచురించారు.
మొత్తం 20 కథలు. మొదటి కథ 1950 లో శారద రాసిన ‘అదృష్టహీనుడు’, చివరి కథ 2012 లో పూడూరి రాజిరెడ్డి రాసిన ‘నగరంలో వాన’. పద్మరాజు, రావిశాస్త్రి, తిలక్ వంటి పూర్వమహాకథకులతో పాటు, కె.శ్రీకాంత్, పూడూరి రాజిరెడ్డి, అద్దేపల్లి ప్రభు వంటి యువకథకులదాకా సుమారు ఏడుదశాబ్దాల పాటు కురిసిన వాన ఇది.
వీటిలో నాకు నచ్చిన ఒక కధ మధురాంతకం మహేంద్ర గారు రచించిన "అతడి పేరు మనిషి". ఈ కధ ను కథానిలయం లో చదవవచ్చు.


message 10: by ♛ ѶaɱՏ¡ (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod
వాన పాటలు ఆల్బమ్స్ తెలుసు , వాన కథా సంకలనం - మంచి ఐడియా.

థాంక్స్ శరత్.


message 11: by ♛ ѶaɱՏ¡ (last edited Jan 31, 2019 11:32AM) (new)

♛ ѶaɱՏ¡  TM (vamsikrishnatm) | 350 comments Mod

ఉత్తమ తెలుగు వాన కథలు
"విత్తనం బొజ్జలో నుంచి పాపాయిని నేల పొత్తిళ్ళలోకి తెచ్చి, పెంచి పెద్దచేసే దేవతే కదా వానంటే. మేఘాలు వెండి దారాలతో భూమికి ఆకుపచ్చని జీవాన్ని నేయడమే కదా వానంటే. ప్రకృతి పసి పాపాయై చేసే అల్లరి చప్పుళ్లే కాదు, కోపంతో ముఖం చాటేసి నిర్దాక్షిణ్యంగా జీవితాల్ని చిదిమి పారేసే మృత్యువు కూడా వానే. ఆనందం, ఆశ్చర్యం, భయం, బీభత్సం, విషాదం, దుఃఖం వానకున్న అనేక ముఖాలు. కళ్ళకు కనిపించే ప్రాణులతో పాటు, కనిపించని కోట్లాది జీవరాశుల బతుకులు శాసించేదే వాన. అలాంటి వాన నేపథ్యంలో తెలుగులో అనేకానేక కథలు వచ్చాయి. అందులో గుండెలు తడి చేసి, ఆలోచనలను తడిమే కథలన్నీ ఒక దరికి చేరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం."


message 12: by Sarath (last edited Feb 01, 2019 02:37AM) (new)

Sarath | 14 comments అమెరికా అమ్మాయి-శ్రీనిధి యెల్లల
కౌముది లో శ్రీనిధి యెల్లల గారు రాస్తున్న అమెరికా అమ్మాయి కబుర్లు తమాషా గా నవ్వించేలా ఉన్నాయి. జనవరి నుండే మొదలు పెట్టారు.
ఇక్కడ చదవొచ్చు .
http://www.koumudi.net/Monthly/2019/j...

శ్రీనిధి గారికి సాయంకాలం కబుర్లు అనే పేరుతో బ్లాగు కూడా ఉంది
Her blog address is http://sayamkalamkaburlu.com/


back to top